E-PAPER

జింకలగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ డాగ్ స్క్వాడ్‌తో ఇంటింటా తనిఖీలు.. అప్రమత్తమైన జిల్లా పోలీసులు

బూర్గంపహాడ్, అక్టోబర్ 2 (Y7 న్యూస్ తెలుగు):
గాంధీ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని జింకలగూడెం గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామునే గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.
సీఐ సతీష్, ఎస్‌ఐ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంది. గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోకి వచ్చేవారు, బయటకు వెళ్లేవారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు.
తనిఖీల సందర్భంగా వాహనాలు, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల వివరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!