E-PAPER

టేకులబోరులో ఘనంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం

కూనవరం, అక్టోబర్ 1 (Y7 News Telugu):
కూనవరం మండలం టేకులబోరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా 9వ జాతీయ పోషణ ఉత్సవాలను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీడీపీవో మల్లిక, సూపర్‌వైజర్ నయోమి, క్లస్టర్ టీచర్లు, తల్లులు, బాలింతలు, చిన్నారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోముల రామారావు మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యం జాతీయ పురోగతికి పునాది అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారం అందించడం, గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు.

పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు పోషణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన మహిళలు, ఆరోగ్యవంతమైన పిల్లలతో సామాజిక అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

అనంతరం గర్భిణీ మహిళకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. తల్లులు, పిల్లలకు పాద సేవ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కరక పవన్, ప్రధాన కార్యదర్శి పాయం వెంకట్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు ఎస్. సుధారాణి, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, యువమోర్చా నాయకులు గెద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!