E-PAPER

తోటి జర్నలిస్టుకు అండగా పలాస జర్నలిస్ట్ అసోసియేషన్

పలాస, అక్టోబర్ 1: అనారోగ్యంతో బాధపడుతున్న తోటి జర్నలిస్టు మేఘనకు పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం సంఘ ప్రతినిధులు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, సహచరులు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం కూడా తమ బాధ్యత అని అన్నారు. మేఘన త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!