స్మార్ట్‌ఫోన్ ప్రియులకు iQOO గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో మార్కెట్లోకి రానున్న iQOO 16లో Samsungతో కలిసి అభివృద్ధి చేసిన అధునాతన డిస్ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ‘Samsung Everest’ పేరుతో పిలుస్తున్న ఈ డిస్ప్లేతో ఫోన్ డిస్ప్లే విభాగంలో కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది. iQOO 16 సెప్టెంబర్ చివర్లో అధికారికంగా లాంచ్ కానుంది.
iQOO, Samsung Display కలిసి నిర్వహించిన స్క్రీన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను ప్రకటించాయి. Samsung M16 లూమినసెంట్ మెటీరియల్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా iQOO 16లో ఉపయోగించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా డిస్ప్లే నాణ్యత, విజువల్ అనుభూతి మరింత మెరుగుపడనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ డిస్ప్లే 2K రిజల్యూషన్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందించనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కాంబినేషన్‌తో మొబైల్ ప్యానెల్‌ను తీసుకొస్తున్నట్లు iQOO తెలిపింది. దీంతో గేమింగ్, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్ వినియోగంలో iQOO 16 డిస్ప్లే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.









