E-PAPER

రాగిపిండి, మునగాకుతో అదిరిపోయే సాంప్రదాయ వంటకం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాల్లో రాగిపిండి, మునగాకు ముఖ్యమైనవి. ఈ రెండింటి కలయికతో తయారు చేసే సాంప్రదాయ వంటకం ఎదిగే పిల్లలతో పాటు పెద్దలకు కూడా మంచి పోషణను అందిస్తుంది. తెలంగాణలో దీనిని రాగి మునగాకు సర్వపిండి అని, ఆంధ్ర ప్రాంతంలో రాగి మునగాకు తపాలా చెక్క అని పిలుస్తారు.

లంచ్ బాక్స్‌లో పెట్టేందుకు, సాయంత్రం స్నాక్‌గా లేదా రాత్రి డిన్నర్‌గా కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రాగిపిండి, మునగాకుతో తయారయ్యే ఈ రొట్టెలు రుచితో పాటు పోషకాలను అందించడంలోనూ ఉపయోగపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని సరిగ్గా నిల్వ చేస్తే రెండు రోజుల వరకు ఉంచుకోవచ్చు.

సాంప్రదాయ రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను అందించే ఈ రాగి మునగాకు రొట్టెలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైన, పోషకాహార వంటకాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!