E-PAPER

చమురు రవాణాకు వరుస అడ్డంకులు.. హర్మూజ్ తర్వాత సౌదీ పైప్‌లైన్‌పైనా దాడి

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 30 శాతానికి పైగా రవాణా అయ్యే కీలక సముద్ర మార్గాలు ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా ఉపయోగిస్తున్న తూర్పు-పడమర పైప్‌లైన్‌పైనా దాడులు జరిగినట్లు సమాచారం. సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ పైప్‌లైన్‌ కీలకంగా ఉండగా.. దీనిపైనా దాడులు జరగడం సౌదీ ప్రత్యామ్నాయ సరఫరా ప్రణాళికలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల ప్రభావంతో ఎర్ర సముద్రంలోని బాబ్ అల్-మండెబ్ జలసంధిలోనూ రవాణా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హర్మూజ్, బాబ్ అల్-మండెబ్ వంటి కీలక మార్గాలతో పాటు ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌పైనా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!