శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామంలో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మల్ల భూపతిరావు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 5న విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి దైవదర్శనం కోసం వెళ్లారు.
తిరిగి సోమవారం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. అనంతరం ఇంట్లో పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.4.37 లక్షల నగదు కనిపించలేదు.
దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదును అపహరించినట్లు బాధితుడు భూపతిరావు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 7న వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పండుగల సీజన్లో కుటుంబాలతో కలిసి బయటకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు సూచిస్తున్నారు.
Post Views: 14









