E-PAPER

‘క్యాబేజీ’తో ఆహార పదార్థాల నాణ్యత తెలుసుకోవచ్చట..! ఎలా అంటే. ?

పాలు, పెరుగు, పనీర్, మాంసం, చేపలు, పండ్లు, వండిన ఆహారం.. ఏదైనా సరే నిల్వ ఉండే కొద్దీ వాటిలో జీవ రసాయన మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మజీవులు పెరగడంతో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమవుతాయని అంటున్నారు. మన కంటితో గుర్తించేసరికి ఆహారం నాణ్యత కోల్పోతుందని పేర్కొంటున్నారు. వాటిని తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలియజేస్తున్నారు. మరి ఆహారం నాణ్యతను గుర్తించేదెలా? అంటే, దీనికోసం ‘స్మార్ట్​ ఫ్రెష్​నెస్’ స్టిక్కర్​ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సాంకేతికతపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని, ఎర్ర క్యాబేజీ ద్రావణం, వడపోత కాగితం లేదా సెల్యులోజ్ కాగితం ఉంటే ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.

ఎలా సాధ్యమంటే : రైతు బజార్లు, సూపర్​ మార్కెట్లలో ఎర్ర క్యాబేజీ దొరుకుతుంది. దాన్ని శుభ్రంగా కడిగి.. నాలుగైదు పొరలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో డిస్టిల్డ్ వాటర్ (శుద్ధమైన నీరు), సిట్రిక్ ఆమ్లం వేసి కలపాలంటున్నారు. తర్వాత నాలుగు పొరల ఎర్ర క్యాబేజీ ఆకులను వేయాలని పేర్కొంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ పొరలను తీసేస్తే.. ఆంథోసైనిన్ అనే రసాయనం గిన్నెలో ఉంటుందట. ఈ రసాయనాన్ని ఒక సీసా లేదా గాజు గ్లాసులో నిల్వ చేసుకోవాలని పేర్కొంటున్నారు. అనంతరం ఒక సెల్యులోజ్ పేపర్ లేదా బయో డీగ్రేడబుల్ పాలిమర్లను తీసుకుని ఆ రసాయనంలో ముంచాలని తెలియజేస్తున్నారు. అనంతరం పనీర్ సహా ఆహార పదార్థాలపై పెడితే చాలట. వాటి నాణ్యతను ‘స్మార్ట్ ఫ్రెష్​నెస్’ స్టిక్కర్​ కొద్ది నిమిషాల్లో చెప్పేస్తుందని వివరిస్తున్నారు.

ఎలాగంటే :

చైనాలోని పలు రాష్ట్రాల్లో ‘స్మార్ట్​ ఫ్రెష్​నెస్’ స్టిక్కర్లను వ్యాపారులు వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వీటిని సెల్​ఫోన్​కు అనుసంధానం చేయడం ద్వారా ఆహార పదార్థాల నాణ్యతను గుర్తించేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు. ఈ స్టిక్కర్ ప్రయోజనాలను వంటగదుల్లోకి కూడా తీసుకెళ్లాలని పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!