E-PAPER

గోదావరిలో పడి వ్యవసాయ కూలి మృతి

అశ్వాపురం, జూలై 28 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి కలివెటి వెంకటేశ్వర్లు (54) ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అనంతరం సాయంత్రం సమయంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో జారి పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతుడి పెద్ద కుమార్తె ఇర్పా రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం ఏఎస్ఐ సూర్యరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో కుమ్మరిగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News