మణుగూరు, జూలై 17 (వై7 న్యూస్): కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్యటన సందర్భంగా మణుగూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన సంతోష్ ప్రస్తుతం కొత్తగూడెంలోని నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో బాధితుడిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, స్థానిక కార్పొరేటర్ సింధు తపస్వి, మణుగూరు మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్, పట్టణ అధ్యక్షుడు గుర్రం సృజన్, జిల్లా యువజన నాయకుడు పద్దం శ్రీనివాస్‌తో పాటు ఇతర నాయకులు పరామర్శించారు.
అనంతరం ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నాగరాజుతో మాట్లాడి సంతోష్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జక్కం రంజిత్, ఆవుల శ్రీను, సూర్య, బోయిల్ల రాజు తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









