బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘3 ఇడియట్స్’ సినిమాపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న ఒక ప్రచారానికి హీరో ఆమిర్ ఖాన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. సినిమాలోని రణ్‌ఛో అలియాస్ ‘ఫున్‌సుఖ్ వాంగ్డు’ పాత్ర సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
లండన్‌లో జరిగిన ‘లగాన్’ ప్రత్యేక ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్ ఖాన్, ‘3 ఇడియట్స్’ షూటింగ్ సమయంలో తనకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి అసలు తెలియదని వెల్లడించారు. తర్వాత ఓ వీడియోలో నటుడు ఓమీ వైద్య అలా చెప్పడం చూశానని, కానీ అది సరైన సమాచారం కాదని ఆయన తెలిపారు.
దీంతో ఎన్నేళ్లుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో కొనసాగుతున్న ప్రచారానికి ఆమిర్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చినట్టైంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులు, నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి.








