E-PAPER

“నన్ను తిట్టారు.. పొగిడారు.. కానీ నన్ను మర్చిపోలేదు” – కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, నేడు ఇండస్ట్రీలో బిజీ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ప్రెస్‌మీట్‌లో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “గడిచిన ఐదేళ్లలో ప్రేక్షకుల ప్రేమే నేను సంపాదించిన అతిపెద్ద ఆస్తి. ఈ ప్రయాణంలో నన్ను తిట్టారు, పొగిడారు, విమర్శించారు, ప్రోత్సహించారు. కానీ ఇవాళ నా పేరు గురించి ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతుందంటే అదే నా విజయంగా భావిస్తున్నాను” అని భావోద్వేగంగా చెప్పారు.

సినిమాలపై ఉన్న అమితమైన ఆసక్తే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెలిపిన కిరణ్ అబ్బవరం, భవిష్యత్తులో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. మంచి కథలతో ప్రేక్షకులను అలరించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News