E-PAPER

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా జెట్టి రామకృష్ణ యాదవ్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 11 (వై7 న్యూస్): జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి (రిజిస్టర్డ్ నెం. 1410-2009) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా జెట్టి రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాల పెంపు, ఆర్థికాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

జిల్లాలో యాదవ యువతను సంఘటితం చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు.

జెట్టి రామకృష్ణ యాదవ్ నియామకంపై జిల్లా వ్యాప్తంగా యాదవ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంతో జిల్లాలో యాదవ సమాజానికి మరింత బలమైన నాయకత్వం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News