భారత తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పలు టెక్నికల్ విభాగాల్లో మొత్తం 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు గరిష్ఠంగా రూ.1.10 లక్షల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.
ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సిగ్నలింగ్ అండ్ టెలికాం టెక్నీషియన్, సివిల్/ట్రాక్ ఫిట్టర్ టెక్నీషియన్, సివిల్/ట్రాక్ మెకానిక్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.
కాగా, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న భారత తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 508 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. జపాన్ షింకన్సెన్ సాంకేతికతతో రూపొందుతున్న ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. తొలి దశలో సూరత్-బిలిమోరా సెక్షన్‌ను ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.








