వై 7 న్యూస్ మణుగూరు:
శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మణుగూరుకు చెందిన సామాజిక సేవకర్త, ఆర్టీసీ కండక్టర్ చెరుకుపల్లి ఉపేందర్ రావును ప్రత్యేకంగా సన్మానించారు.
సామాజిక సేవలో పలు కార్యక్రమాలు చేపట్టి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు ఉపేందర్ రావును సత్కరించినట్లు కేఎస్పీ అధినేత కొలిచలం పూర్ణచంద్రరావు మరియు అధ్యక్షుడు గుమ్మడిదల వెంకటనారాయణ తెలిపారు.
ఇటీవల కాలంలో ఉపేందర్ రావు “పర్యావరణ పరిరక్షణ – భావితరాల సంరక్షణ” అనే నినాదంతో మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజుకు ఒక మొక్క నాటాలని పిలుపునిస్తూ, వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ మహిళల గౌరవాన్ని ప్రోత్సహించడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి పనిచేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కొలిచలం గీతా, కుమ్మర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి, రామనాథం, మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారులు గంగాధర వీరయ్య, కుమార్ స్వామి, శ్రీను, బొడ్డుపల్లి వేణు, రామకృష్ణ తదితరులు పాల్గొని ఉపేందర్ రావును అభినందించారు.








