వై7 న్యూస్ | భద్రాద్రి కొత్తగూడెం
ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మణుగూరు నుండి అశ్వాపురం మీదుగా భద్రాచలం క్రాస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది.
అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ర్యాలీలో భాగంగా “అడవులు కాపాడాలి – భవిష్యత్తు రక్షించాలి” వంటి నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మయ్య, ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, ఎఫ్‌ఎస్‌ఓ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34








