మణుగూరు, సెప్టెంబర్ 20 (Y7 న్యూస్ తెలుగు):
మణుగూరులోని శ్రీ సత్య భాస్కర మాంటిసోరి స్కూల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం తీరొక్క బతుకమ్మలతో రంగు రంగుల పూలతో సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉత్సవాలను జరిపారు.
స్కూల్ ప్రాంగణం మొత్తం పూలతో అలంకరించగా, విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వేషధారణలో బతుకమ్మ చుట్టూ ఆడిపాడి సంబరాలను మరింత అందంగా మలిచారు.
ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ “బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక ఆభరణం. చిన్నప్పటి నుంచే పిల్లలకు సాంప్రదాయ విలువలు, సంస్కృతి పట్ల అవగాహన కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం” అని తెలిపారు.
Post Views: 97









