E-PAPER

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో నాణ్యత లేమి…?

సీసీ రోడ్ల నిధులు దుర్వినియోగం

పనులను త్వరగా పూర్తి చేయాలి

రేణుక అక్షర మహిళా మండలి సభ్యుల డిమాండ్

మున్సిపల్ కమిషనర్ కు వినతి

మణుగూరు, సెప్టెంబర్ 25 : మున్సిపా లిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల నిర్మాణా ల్లో నాణ్యత ప్రమాణాలు కాంట్రాక్టర్లు కచ్చితంగా పాటించాలని, రేణుక అక్షర మహిళా మండలి సభ్యుల డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలలో సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనుల పురోగతిని వారు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, సెంట్రల్ లైటింగ్ పనులలో నాణ్యత లేమి కనిపిస్తుందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రేణుక అక్షర మహిళా మండలి కార్యాలయంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు పూనెం సరోజ, సీనియర్ నాయకురాలు షబానా విలేకరుల తో మాట్లాడారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సిబ్బంది వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించే విధంగా చూడాలన్నారు. రాజీవ్ గాంధీ నగర్ లో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కమిషనర్‌లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.అలాగే మునిసిపా లిటీలో నిర్మిస్తున్న సెంట్రల్‌ లైటింగ్‌, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు. నాసిరకం విద్యుత్ పరికరాల వాడకం వంటి లోపాలతో సెంట్రల్ లైటింగ్ పనులు సాగుతున్నాయని, దీనికి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి కారణమని పేర్కొన్నా రు. మరోవైపు సిసి రోడ్డు పనులలో అధికా రులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరి అండదండలతో నాసి రకంగా పనులు జరుగుతున్నాయని,ఈ పనులపై విచారణ జరిపించి గుత్తేదారులు, ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాసిర కంగా అభివృద్ధి పనుల ను చేపట్టి ప్రజాధనం వృథా చేస్తే స హించేది లేదని, హెచ్చరించారు.త్వరలోనే క్వాలిటీ కంట్రోల్ అధికారులకు, మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించే లా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో రేణుక అక్షర మహిళా మండలి నాయకులు బొడ్డు సౌజన్య, కోరి శ్యామల, రెడ్డీబోయిన రేణుక, దేరంగుల సుజత,కన్నాపురం వసంత, డాకూరి సౌజన్య, బాడీష పార్వతి,కన్నాపురం శైలజ తదితరులు పాల్గతదితరులు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News