E-PAPER

రామానుజవరం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద వీధి దీపాల విరాళ కార్యక్రమం

మణుగూరు, సెప్టెంబర్ 19 (వై 7 న్యూస్):
రామానుజవరం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద శుక్రవారం సిపిఐ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో 200 వీధి దీపాల విరాళ కార్యక్రమం ఘనంగా జరిగింది.

గ్రామంలో రాత్రి వేళల్లో వీధి దీపాల లేమితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాబోయే బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వీధిలో దీపాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీపాల పంపిణీతో పాటు వాటి అమరికకు అవసరమైన వైర్లు, హోల్డర్లు, ఇతర సామాగ్రి మరియు ఫిట్టింగ్ ఛార్జీలు కూడా నిర్వాహకులు భరించారు.

బాడిస సతీష్ మాట్లాడుతూ..నేను పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల అవసరాలు తీర్చడం, వారి సౌకర్యాల కోసం కృషి చేయడం నా ధ్యేయం. సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ సేవా భావంతో ముందుకు వస్తాను. గ్రామ పంచాయతీ ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల MPDO శ్రీనివాస్, MPO వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ మణుగూరు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, మాజీ MPP యాడారి రమేష్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నోముల రవి, మాజీ వార్డ్ సభ్యులు మండారి అదయ్య, డోనకాని రాములు, మామిళ్లపల్లి శ్రీను, కట్ట నరసయ్య, పోతనబోయిన కోటయ్య, కిరణ్, మహేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి బాడీష సతీష్ (మాజీ సర్పంచ్/తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News