E-PAPER

మార్వాడీ మోసగాళ్ళ గుట్టురట్టు: వరంగల్‌లో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వస్తువుల రాకెట్ ఛేదించిన టాస్క్ ఫోర్స్

వరంగల్ జులై 20 వై 7 న్యూస్;

వరంగల్ పట్టణ కేంద్రాన్ని డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామాగ్రితో ముంచిన మాయల మార్వాడీ వ్యాపారుల గుట్టు చివరకు బయటపడింది. కరెంట్ వైర్లు, స్విచ్ బోర్డులు, ఫ్యూజ్‌లు సహా అన్ని రకాల విద్యుత్ సామాగ్రిని నకిలీ బ్రాండ్లతో అమ్ముతూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన మార్వాడీ దుకాణదారులపై టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ రైడుల్లో లక్షలాది రూపాయల విలువ చేసే డూప్లికేట్ సరుకులు స్వాధీనం చేసుకొని, పలువురిని అరెస్ట్ చేశారు. నిజమైన బ్రాండ్లను అనుకరించేలా తయారు చేసిన ఈ నకిలీ సామాగ్రి వలన అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చని అధికారులు హెచ్చరించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వస్తువులు విక్రయించే వారిపై వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్