అశ్వాపురం,జూలై 19 (వై 7 న్యూస్);
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వైన్స్ షాప్ లో శుక్రవారం రాత్రి క్యాషియర్ తోట వేణు పై పెట్రోల్ పోసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం విపరీతంగా మద్యం సేవించి అప్పు ఇవ్వాలని అడగగా లేదన్నందుకు శుక్రవారం వైన్ షాప్ క్యాషియర్ తోట వేణు పై మొండికుంట గ్రామానికి చెందిన నగునూరు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బాటిల్ లో పెట్రోల్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వారిపై పోసినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి తెలిపారు.
Post Views: 28