సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాజీవ్ గాంధీ నగర్‌లో కనీస పరిశుభ్రత లేకపోవడంపై ఆందోళన
మణుగూరు, జూలై 19 (వై 7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ టేకు చెట్ల బజారు వీధిలో ప్రజలు తీవ్రమైన అనారోగ్య భయాలతో జీవిస్తున్నారు. రేషన్ షాప్ పక్కనున్న ఖాళీ స్థలం లో వర్షాకాలంలో మురుగు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా నిలిచిపోవడం, దానికి తోడు చెత్తాచెదారం కలిసిపోవడం వలన ఆ ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారింది.
ఈ పరిస్థితుల వల్ల విషపూరిత సర్పాలు, తేళ్లు, పురుగులు మొదలైనవి ఇళ్లలోకి చొరబడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు మార్లు పంచాయతీ అధికారులకు కంప్లయింట్లు చేసినప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మణుగూరు కాంగ్రెస్ పార్టీ రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా వారు మణుగూరు ఎంపీడీవో, తహసిల్దార్, సమితి సింగారం పంచాయతీ సెక్రటరీలకు వినతిపత్రాలు అందజేశారు. అయినప్పటికీ స్పందన లేకపోతే, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు ఐటిడిఏ పీఓ దృష్టికి తీసుకెళ్తామని ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పూనెం సరోజ రేణుక అక్షర మహిళా మండల అధ్యక్షురాలు,ఎం.డి. షబానా, కోరి శ్యామల సీనియర్ మహిళా నాయకులు,బొడ్డు సౌజన్య ఉపాధ్యక్షురాలు,రెడ్డి బోయిన రేణుక జనరల్ సెక్రటరీ,డేరంగుల సుజాత, ఎం.డి. షరీఫ్, పింగళి మాధవరావు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు..