అన్నపురెడ్డిపల్లి, జూన్ 21,వై సెవెన్ న్యూస్ తెలుగు;
అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలము లోని ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష హైదరాబాద్ ఆదేశాల మేరకు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో ఉదయం 6-30 నుండి 7-30 వరకు నిర్వహించారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ లకావత్ జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యానికి యోగా ఉపయోగ పడుతుందని, అందరూ ప్రతి రోజు యోగా చేయాలని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాద్యాయులు వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సునంద రెడ్డి, శాంత కుమారి, బాబూరావు, వెంకటేశ్వర రావు, వసంత, సుశీల, పద్మ, మోతీలాల్, పాఠశాల సిబ్బంది శ్రీనివాస్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
