పిఠాపురం కాంసెన్సీ క్యూ కొత్తపల్లి మండలం (వై 7 రిపోర్టర్) జూన్ 11
బుధవారం తెల్లవారు జామున ఉప్పాడ కొత్తపల్లి మండలం, మూలపేటలో కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశానుసారం మూలపేట ఏరియాలో సీఐ పిఠాపురం వారి సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో అనుమానితులను తనిఖీ చేసి మరియు వారి వద్ద నుండి సరైన పత్రాలు లేని సుమారు 48 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను సీజ్ చేసినారు అదేవిధంగా 20 లీటర్ల నాటు సారా సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. కార్డునన్ సెర్చ్ అనంతరం సిఐ పిఠాపురం అక్కడే ప్రజలతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు/అనుమానితులు కనిపించిన, ఏదైనా అసాంఘిక చర్యలు జరిగిన వెనువెంటనే ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ఇంటి యజమానులు, కొత్త వ్యక్తులకు ఎవరికైనా ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వారి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచింనారు.