బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ పినపాక నియోజకవర్గ ఇన్చార్జి
మణుగూరు, మార్చి 07 వై న్యూస్ తెలుగు;
మణుగూరు మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వరరావు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పినపాక నియోజకవర్గ ఆర్ పి ఎస్ ఇంచార్జి బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ మాట్లాడుతూ ఈనెల తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు పినపాక నియోజకవర్గ కేంద్రం మణుగూరులో మాదిగల డప్పుల ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారంగా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ లో అవకతవకలను సరిచేయాలని. షెడ్యూల్ కులాల వర్గీకరణ మూడు గ్రూపులుగా కాకుండా ఏ బి సి డి నాలుగు గ్రూపులుగా విభజించాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగ ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో మంత్రి పదవులు కల్పించాలని. ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మణుగూరు మండల ఇన్చార్జి కొమ్ము హుస్సేన్ మాదిగ. బోయిల్ల నరసింహారావు మాదిగ. పొడుతూరి కళ్యాణ్ మాదిగ. చిట్యాల రజిత మాదిగ. ఉసికల కొండయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు సామాజిక ఉద్యమ నమస్కారాలతో బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ. ఎమ్మార్పీఎస్ పినపాక నియోజకవర్గ ఇంచార్జ్ పాల్గొన్నారు.