అశ్వారావుపేట,మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు
మండలం లోని పాతరెడ్డిగూడెం గ్రామపంచాయతీ ని రాష్ట్ర ప్రభుత్వం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఒకే విడతలో అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చటానికి ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న తరుణంలో స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ చేతులమీదుగా శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, హౌసింగ్ ఏ ఈ సుబ్రహ్మణ్యం,పలుశాఖల అధికారులు కాంగ్రెస్ మండల నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 19