మణుగూరు, మార్చి 05 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యనిర్వాహన అధికారి బి. నాగలక్ష్మి నేటి ఉదయం మణుగూరు మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. తన సందర్శనలో భాగంగా సిబ్బంది హాజరు పరిశీలించి, మండల పరిషత్ ద్వారా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా, మండల పరిషత్ పాత్ర ఎంతో కీలకం అని తెలియజేస్తూ, సిబ్బంది అందరూ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా, జిల్లా కలెక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం, జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై సమీక్ష నిర్వహించి, అమలు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మణుగూరు మండలంలో ప్రభుత్వ పథకాల విజయవంతమైన అమలు కోసం అధికారులందరూ సమష్టిగా శ్రమించాలని ఆమె ఆకాంక్షించారు.
Post Views: 45