నేలకొండపల్లి, మార్చి 05 వై 7 న్యూస్;
పైనంపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కుక్కల సత్యానందం (70) గత రాత్రి అకాల మరణం చెందారు.ఈ విషయం తెలుసుకున్న పాలేరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కొండబాల కరుణాకర్,టిడిపి జిల్లా కార్యదర్శి నాగార్జునపు శ్రీనివాసరావు, నేలకొండపల్లి మండల టిడిపి అధ్యక్షుడు ఆరెకట్ల కొండలరావు, గ్రామ టిడిపి నాయకులతో కలిసి సత్యానందం పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 43