సిద్దిపేట డిసెంబర్15 వై సెవెన్ న్యూస్
శ్రీ వేంకటేశ్వర స్వామి పాత దేవస్థానం
పారుపల్లి వీధి, సిద్దిపేట లో ఆదివారము రోజున ఉదయం భక్తులు సహకారముతో సమర్పించిన
పంచలోహాలతో తయారు చేయించిన గోదాదేవి అమ్మవారి నూతన విగ్రహానికి అభిషేకము పూజలు నిర్వహించి ఆలయములో స్థిరపరచడం జరిగింది అని ఆలయ అధ్యక్షులు శ్రీ మాంకాల నవీన్ కుమార్ తెలియజేశారు.ఈ సందర్భముగా ఆలయ అధ్యక్షులు మాంకాల నవీన్ కుమార్ శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షుడు గంప శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఉన్న వద్ద గోదాదేవి అమ్మవారు కూడా ఉండడం మంచిది అని ఉద్దేశించి ఆ అమ్మవారి నీ స్వామి చెంతకు చేర్చనైనది అని తెలియజేసి అలాగే లోక కళ్యాణార్థం ధనుర్మాసం సందర్భముగా ఆలయములో ఉదయస్తమాన హారతులు
తేదీ: 16-12-2024 సోమవారము నుండి
ప్రతీ రోజూ ఉదయం 6-00 గంటలకు ధనుర్మాస హారతులు నిర్వహించబడును అని భక్తులు ఈ ధనుర్మాస పూజల్లో పాల్గొని ఆ దేవతా మూర్తుల కృపకు పాత్రులు కాగలరు అని భక్తి పూర్వకముగా తెలియజేశారు.ఈ కార్యక్రమములో ఆలయ మరియు సమితి ప్రతినిధులు సభ్యులు పుల్లూరి శివ కుమార్, కొర్తివాడ శ్రీనివాస్, కిషన్, కాచం కాశినాథ్, శ్రీనివాస్, గౌరీశంకర్, కమిటీ సభ్యులు మహిళా గోష్ఠి సభ్యులు హాజరై కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు