శివ్వంపేట. డిసెంబర్,15 వై సెవెన్ న్యూస్
పురుగుల మందు తాగి 32 (సం, )రాల యువకుడు మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలం చెన్నపూర్ గ్రామాం లో చోటుచేసుకుంది శివ్వంపేట ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ముద్దగల్ల ఆంజనేయులు వయస్సు (32సం ) ఆంజనేయులు భార్య మరియు ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల కిందట ఇంటి నుంచి వెళ్లి ఇప్పటికి తిరిగి రాకపోవడం వలన గత కొంత కాలంగా మధ్యనికి బానిసయ్యి శనివారం రాత్రి ఒంటి గంటలకు అతని ఇంట్లో తాగిన మైకంలో గుర్తుతెలియని గడ్డి మందు తాగి ఇంటి బయటకు వచ్చి అరుస్తుండగా అతని తమ్ముడు అశోక్ అతన్ని చూసి నర్సాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించి అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తుండగా ఆదివారం ఉదయం 6 గంటలకు చికిత్స పొందు మృతి చెందాడు అని మృతుని తమ్ముడు అశోక్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు