ఎన్టీఆర్ జిల్లా,డిసెంబర్ 10 వై 7 న్యూస్;
తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళనుండి బంగారు నగలు చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్.చోరీ జరిగిన 24గంటల్లో కేసు ను చేదించి నిందితురాలిని అరెస్ట్ చేసి దొంగిలించ బడిన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.275 గ్రాముల బంగారు విలువ సుమారు 13లక్షలు విలువ ఉంటుందని పోలీసులు అంచనా.కేసును చాలెంజ్ గా తీసుకుని త్వరిత గతిన చేదించిన పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించిన డిసిపీ కె ఏం మహేశ్వర రాజు.ఈ సమావేశంలో మైలవరం ఏసిపి వై.ప్రసాదరావు, సీఐ కె.గిరిబాబు,ఎస్సైలు కేవిజీవి సత్యనారాయణ, వి.వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 34