సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్
శ్రీరాంపూర్, డిసెంబర్ 7 వై సెవెన్ న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు డిసెంబర్ 9 లోపు వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకుంటే డిసెంబర్ 10న చలో ప్రజా భవన్ కు సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కదిలి రావాలని శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పిఓసిలో కార్మికుల అడ్డం మీటింగ్లో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గట్టు మహేందర్ ఎస్సీ కేఎస్ సిఐటియు శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పడితే నెల రోజుల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని కోల్బెల్టు ఎమ్మెల్యేలు అలాగే గోదావరిఖని బహిరంగ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం అవుతుంది. కానీ కార్మికులకు ఇచ్చిన హామీ మాత్రం నీళ్ల మూటగానే మిగిలిపోయింది. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విషయంలో గత పాలకుల అడుగుజాడల్లోనే ఈ పాలకులు నడుస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలోకి నేడు కాంట్రాక్ట్ కార్మికులు వెళ్తున్నారు. ఈ డిసెంబర్ 9 లోగా వేతనాలు పెంచుకుంటే 10న ప్రజా భవన్ కు రావడమే కాదు ,ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను మా పోరాట కేంద్రాలుగా మలిచి, మరో ఉద్యమానికి సైతం సిద్ధమైద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంపతి, సమ్మన్న, అశోక్, ప్రభాకర్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.