ఎన్ఎస్యుఐ అశ్వాపురం మండల అధ్యక్షుడు హర్ష
యూత్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి నరేష్ కుమార్, కోలా శశికాంత్
అశ్వాపురం డిసెంబర్,04 వై సెవెన్ న్యూస్ తెలుగు
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రెటరీగా పనిచేసిన మీరు నియంతలా ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు అని ఉపాధ్యాయులని మీరు ఎంతగా వేధించారో ఎవరిని అడిగినా చెబుతారని వారు ఆరోపించారు. మీ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో వందల సార్లు, పురుగుల భోజనం పెట్టడం, కనీసం స్నానం చేయడానికి సబ్బులు కూడా ఇవ్వడం చేతకాలేదు ఎన్నోసార్లు ఈ విషయం బయటికి రాలేదా అని ప్రశ్నించారు. మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, గురుకులాలలో దాదాపు 15 వేల మందికి పదోన్నతులు,11 వేల మందినీ ప్రభుత్వం నియమకం చేసింది. మీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలోనే 30 శాతం మెస్ చార్జీలు పెంచడం. పాఠశాలలు తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాంలు, ఇచ్చి మెరుగైన భోజనం అందిస్తుంటే ఓర్వలేకనే మీరు రాజకీయాలు చేస్తున్నారని ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు.