E-PAPER

ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేయాలి

కార్పొరేట్ విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వం

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్

పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంబి నర్సారెడ్డి

సిపిఎం మండల 9వ మహాసభ

బూర్గంపాడు,నవంబర్ 22 వై 7 న్యూస్;

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. బూర్గంపాడు మండలం సారపాకలోని పార్టీ కార్యాలయంలో సిపిఎం 9వ మండల మహాసభ జరిగింది. తొలు త పార్టీ కార్యాలయం నుంచి ఐటిసి ఈస్ట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రధాన కూడల్లో ఉన్న సిపిఎం పార్టీ జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ఆవిష్కరించారు. అదేవిధంగా సిపిఎం అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మహా సభకు సిపిఎం 9వ మహాసభకు సిపిఎం నాయకులు రామనాథం, సరోజినీలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిం దని ఆయన అన్నారు. ప్రధానంగా ఆరు గ్యారం టీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు.ఈ ఆరు గ్యా రంటీలను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభు త్వం కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలం బిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై భవిష్యత్తులో సిపిఎం చేపట్టబోయే ఆందో ళన, ఉద్యమ కార్యక్రమాలలో ప్రజలు,సిపిఎం శ్రేణు లు భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొ న్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. కార్పొ రేటు విధానాలకు మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పేద ప్రజలను బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆయన ఆరోపించారు. ప్రజా వ్యతి రేక విధానాలను అవలంబిస్తున్న ఈ పాలక ప్రభుత్వాలపై సిపిఎం చేపట్టబోయే అనేక ఉద్యమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటే శ్వర్లు, పార్టీ నాయకులు అజయ్ కుమార్, బయ్యా రాము, రాయల పాపినేని సరోజన కనుక వెంకటేశ్వర్లు ఎస్.కె ఆబిదా గుంటక కృష్ణ వెపాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :