E-PAPER

కొడంగల్ కేంద్రంగా తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వండి

తెలంగాణ రాష్ట్ర డిజిపి కి లేఖ

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

సూర్యాపేట,నవంబర్20 వై 7 న్యూస్;

డిసెంబర్ 3 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా తాము నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి కి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ లేఖ రాశారు .అనుమతి నిరాకరించిన, దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ధోరణిలో తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000 పెంచుతామని వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయ అస్త్రం మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొన్న నాటి పీసీసీ అధ్యక్షుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ధోరణిలో తమ సంఘం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నందున తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని డిజిపి కి లేఖ రాసినట్లు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. డిజిపి తమ దీక్షకు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ దీక్షను కొనసాగిస్తామని తమ దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిగోండ తరహా తమపై కాల్పులు జరిపిన హక్కుల సాధనకై ఎదురోడ్డి పోరాడేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు స్వష్టం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు గోగుల శేఖర్ రెడ్డి ఆరూరి బాబు అల్వాల రమేష్ గుమ్మడేల్లి ఆంజనేయులు దారావత్ లచ్చు జక్కరి నర్సమ్మ భూతం వెంకటమ్మ పోల్దాస్ బిక్షవమ్మా శ్రీరాముల లక్ష్మయ్య ఎల్లబోయిన ఆలియమ్మ దొడ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్