ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ డిమాండ్
జూలూరుపాడు,నవంబర్ 20 వై 7 న్యూస్;
రాష్ట్రంలో ఫీజు రియంబర్స్‌మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో తమ సర్టిఫికెట్లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కళాశాల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.
కొందరు విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లలేక ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ కళాశాలలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కళాశాలలు ఆర్థిక సంక్షోభనికి గురవుతున్నాయి.
భవన కిరాయిలు, నిర్వహణ ఖర్చులు పూడ్చుకోలేక సదుపాయాలు తగ్గిస్తున్నాయి.
మంచి విద్యా ప్రమాణాలు తగ్గిపోవడమే కాక, విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి కూడా క్రమంగా తగ్గుతుంది.ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, విద్యార్థుల భవిష్యత్తు మరియు విద్యా వ్యవస్థ మీద దీర్ఘకాలిక ప్రభావాలు పడే అవకాశం ఉందని నిష్పక్షపాతంగా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి సమస్యను పరిష్కరించాలి.దసరా తరువాత డిగ్రీ కళాశాలలు నాలుగు రోజులు బంద్ చేసినా, ప్రభుత్వం వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ రోజు నుండి మళ్ళీ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తామని పరీక్షలు బహిష్కరిస్తామని ప్రకటించడంతో దీని ప్రభావం విద్యార్థుల విద్యాసంవత్సర భవిష్యత్తుపై పడుతుండన్నారు. ఓవైపు అనేక సెలవులు వల్ల ఇప్పడిప్పుడే అకాడమిక తరగతులు సక్రమంగా జరుగుతూ కొన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఒకటి రెండు రోజుల్లో జరుగనున్నాయన్నారు. కొన్ని యూనివర్సిటీలో పరీక్ష ఫీజుల తేదీలు వచ్చాయని ఇప్పుడు బంద్ చేస్తే విద్యార్థ్యలు చాలా నష్టపోతారని, ప్రభుత్వం ఫీజుబకాయిల పట్ల మొండి నిర్లక్ష్యాన్ని వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలను విడుదల చేస్తామని అన్నారు. నేడు అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్న కూడా పెండింగ్ ఫీజు బకాయిలను ఇవ్వకపోవడం సీఎం వద్ద విద్యాశాఖ ఉన్న కూడా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం సరికాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగు లోత్ వంశీ అన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల చదువులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాలల వారితో చర్చించి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్,
స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆకాష్ నాయక్ అన్నారు. ఈ సమస్యను వేగంగా పరిష్కరించకపోతే, ఇది విద్యార్థుల భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపుతోందని ,ఇది సమాజంలో పెద్ద సమస్యగా మారకముందే ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.