మహమ్మద్. జహీర్ ఇక్బాల్ చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్
నర్సాపూర్,నవంబర్19 వై 7 న్యూస్ తెలుగు;
గత 20 సంవత్సరాల సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మరియు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ తన వంతుగా సేవలను అందిస్తూ మరియు మానవ హక్కుల సంఘం లో చురుకుగా పని చేస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు న్యాయం ఇప్పించడంలో కృషి చేస్తున్నందుకు గాను అతని సేవలను గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్ ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మహమ్మద్. జహీర్ ఇక్బాల్ కు ప్రదానం చేశారు.జహీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, నాకు డాక్టరేట్ ఇచ్చిన అమెరికన్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ
ఈ గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో భవిష్యత్తు లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసారు.
Post Views: 108