E-PAPER

కులాల వారిగా జనాభా లెక్కల సేకరణకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి

బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్,టీఎస్ జేఏసీ ఛైర్మన్ కోల జనార్ధన్ గౌడ్

మిర్యాలగూడ,నవంబర్19,వై 7 న్యూస్ తెలుగు

బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, టీఎస్ జేఏసీ ఛైర్మన్ కోల జనార్ధన్ గౌడ్ మిర్యాలగూడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారని. దేశవ్యాప్తంగా కులాల వారిగా జనాభా లెక్కల సేకరణకు కాంగ్రెస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలని తెలియజేశారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కుల గణనపై కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ ప్రచురించిన మేనిఫెస్టోలో కూడా బీసీ లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పనకు ప్రతిజ్ఞ వ్యక్తం చేయడం, బీసీలకు విద్య, ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత హక్కులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్న వాగ్దానాలు ప్రస్తావనకు వచ్చాయి.

కుల గణన – సమాజ మార్గదర్శకం

కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ అనేది బీసీ సమాజాన్ని ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. వారు చెప్పినట్లుగా, బీసీల శ్రామిక దోపిడీకి గురైన చరిత్రను అరికట్టే మార్గం కుల గణనే అని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై భారం
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కల సేకరణలో కులాల వారీ గణనకు ప్రాధాన్యత ఇవ్వాలని మారం శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను చేపట్టి దేశవ్యాప్తంగా కుల గణన అమలు చేయాలని పిలుపునిచ్చారు.

రాజకీయ దార్శనికత
రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వ్యవస్థను ఎదుర్కొని, బీసీల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కాంగ్రెస్‌ పార్టీ కర్తవ్యం అని జనార్దన్ గౌడ్ చైర్మన్ టిఎస్ జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ హక్కుల కోసం కట్టుబడి ఉన్నారన్న నమ్మకంతో, బీసీ నాయకత్వం, బీసీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం పై ఇంకా మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ జేఏసీ మీడియా సమావేశంలో సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News