ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ,నవంబర్19 వై 7న్యూస్
మొదటి భారత మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా
మిర్యాలగూడ పట్టణం లోని రాజీవ్ భవన్ నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశపు తొలి మహిళా ప్రధాని మరియు ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసిందన్నారు.ఆమె కుటుంబం అంతా దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని,రాజకీయాల్లో రాణించాలి అనుకునే నేటి మహిళలకు వారి జీవితం ఎంతో ఆదర్శం అని అన్నారు.దేశంలో, రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్నారు అని తెలిపారు.వారికి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ తరుపున ఘన నివాళులు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…









