బాన్సువాడ నవంబర్ 19 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరి ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహా దారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు మరియు బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు,నాయకులు,రైతులు.
మీడియా సమావేశంలో పోచారం మాట్లాడుతూ,
గతంలో కన్నా ఎక్కువ ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాం,కనీస మద్దతు ధరతోపాటు బోనస్ అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నాను.
నిజాంబాద్,కామారెడ్డి జిల్లాల కలెక్టర్ల దగ్గర నుండి వచ్చిన నివేదికల ప్రకారం,
ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో నేటి వరకు
8082 మంది రైతులు నుండి 65,932 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 67, 901 మంది రైతుల నుండి 4, 98,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
కామారెడ్డి ఒక్క జిల్లాలో 30640 మంది రైతుల నుండి 2,10,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసాం.
నిజామాబాద్ జిల్లా నుండి 37,261 మంది రైతుల నుండి 2,87,523 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
గత ఏడాది కన్న ఎక్కువ కొనుగోలు చేశాము.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 23 జూన్ నాడు నిజాంసాగర్ నీటిని సకాలంలో ఉపయోగించుకోవడంతో రైతులు ముందస్తు నారుమడులు వేసుకోవడం వలన కోతలు ముందుగానే వచ్చాయి.
రాష్ట్రం ఇన్నేళ్ల చరిత్రలో కనీస మద్దతు ధర రూ 2320తో పాటు రూ 500 బోనస్ ను అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
ఈ సందర్భంగా ఒక రైతుగా, రైతు శ్రేయోభిలాషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇప్పటికే కొంతమంది రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు ప్రభుత్వం వేయడం జరిగింది, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు .కనీస మద్దతు ధరతో పాటు రూ 500 రూపాయల బోనస్ సైతం మీ ఖాతాల్లో పడుతాయి
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో గల 25 సొసైటీలో దాదాపు అన్నింటిలోనూ ధాన్యం కొనుగోలు పూర్తి కావస్తుంది.
చింతకుంట,గోవూరు, హుమ్నాపూర్,వర్ని సొసైటీలలో దాన్యం కొనుగోలు పూర్తయిపోయింది.
మైలారం, బైరాపూర్, దేశాయిపేట , దుర్కి సొసైటీలలో ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవనున్నాయి మిగతా సోసైటీలలో ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది.
బాన్సువాడ నియోజకవర్గం లో నిర్మించుకున్న డబల్ బెడ్ రూం ఇళ్లకు మొదటి విడతలో రూ. 8 కోట్లను పంపిణీ చేశాం.
నిన్న మరో ఏడున్నర కోట్ల బిల్లులను లబ్ధిదారులకు అందించాం. మిగతా వారికి సైతం త్వరలోనే అందిస్తాం.
ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తాం
నియోజక వర్గంలో ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాను
యాసంగి పంటకు సైతం నిజాంసాగర్ లో నీరు నిండుగా ఉండడంతో రైతులకు నీటిని సకాలంలో అందిస్తాం.నారుమడులు వేయడానికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం.
నవంబర్ లో నారుమడులు పోసుకుంటేనే పంట చివరి కాలంలో వచ్చే వడగళ్ల వాన నుండి పంట నష్టం జరగకుండా ఉంటుంది.
ఈ వరి ధాన్యం బోనస్ వచ్చిన రైతులు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.









