ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్ రాజు
సిద్దిపేట, నవంబర్18 వై సెవెన్ న్యూస్
బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన బీడీ కార్మిక సంఘం జిల్లా రెండో మహాసభలకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిరంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీడీ కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించి కార్మికులకు హక్కులు సాధించిన ఘనత ఏఐటీయూసీ కి దక్కిందన్నారు. వెట్టి చాకిరికి గురవుతున్న బీడీ కార్మికులకు కనీస వేతనం జీవో అమలు చేయాలని, బీడీ కార్మికుల ఖాతాలో కూలి డబ్బులు వేసే విధానం నిలిపివేసి పాత పద్ధతి ప్రకారం కార్మికులకు నేరుగా నగదు పంపిణీ అమలుపరచాలని, అర్హులైన బీడీ కార్మికులందరికీ ఇండ్లు ఇంటి స్థలం కోసం పదిలక్షల ఆర్థిక సాయం అందించాలని, బీడీ పరిశ్రమపై పలుమార్లు పెంచుతున్న జీఎస్టీ పనులను వెంటనే తగ్గించాలన్నారు. నెల 26 రోజుల పనిని కల్పించి బీడీలకు సరిపడా తుని కాదు తంబాకు దారం తదితర ముడి సరుకు కంపెనే సరఫరా చేయాలని, కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించి సంక్షేమ పథకాలైన బీడీ స్కాలర్షిప్ ఇండ్ల నిర్మాణంకు ఆర్థిక సాయం ఇతర పథకాలను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీడీ పరిశ్రమలోని అన్ని రకాల కార్మికులకు ప్యాకర్స్, సేకర్స్, బట్టి వాళ్లకు కమిషన్ ఏజెంట్లకు 4016 రూపాయలు ఎలాంటి నిబంధన లేకుండా జీవన భత్యం ఇవ్వాలని, ఈఎస్ఐ సిద్దిపేట ఆసుపత్రిని కనీస వసతులు కల్పించి, గతంలో బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కార్మికుల పుట్టగొట్టే కోత్ప చట్టాన్ని పోరాటాల ద్వారా నిలిపివేయడం జరిగిందన్నారు. ఈపీఎఫ్ఓ సంస్థలో పిఎఫ్ కు రాజీనామా అనంతరం బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న పీఎఫ్ ఆఫీసును ఎట్టి పరిస్థితుల్లో తరలించారాదని కోరారు. తరలించిన యెడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్, సుతారి రాములు, రాష్ట్ర నాయకులు ఎండి.ముక్రం, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు అందె అశోక్, జిల్లా నాయకులు దీకొండ శ్రీనివాస్, బెక్కంటి సంపత్, ఈరి భూమయ్య వలబోజు నరసింహ చారి, హరికృష్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.