జగ్గయ్యపేట NTR జిల్లా
రిజెక్ట్ చేయబడిన అడ్మిషన్లు కన్ఫామ్ చేయమని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కి పి.టి.యల్.యఫ్ NTR జిల్లా అధ్యక్షులు కరిసే మధు వినతి పత్రం అందజేశారు.
గుంటూరు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్, గుంటూరు కార్యాలయ అధికారికి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు విన్నతి పత్రాన్ని ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల విషయంలో సమయానుకూలం దాటడంతో తిరస్కరించిన అడ్మిషన్లు మరియు రిజిస్ట్రేషన్ అయిన అడ్మిషన్లు ఎక్కువ మొత్తంలో ప్రతి జిల్లా నుంచి ఉండటం మూలంగా,విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆలోచించి వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి, అడ్మిషన్ ఫీజు కట్టుకోవడానికి అవకాశం కొనసాగించేలా వెంటనే స్పందించి అనుమతించాలని ఆయన సంబంధించిన అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు.