బాన్సువాడ అక్టోబర్ 19 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ మండలంలోని
ఆ గ్రామస్తులు సంచలమైన నిర్ణయం తీసుకున్నారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు కాడు కకుండా పచ్చని సంసారాలు చిన్న బిన్నం అవుతున్నాయి. మద్యం మత్తులో ఎన్నో అగత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు తమ గ్రామంలో జరుగుకూడదని, తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆ గ్రామ పెద్దలు, యువకులు ఒక నిర్ణయానికి వచ్చారు. మద్యం తాగడం వల్ల జరగబోయే పరిణామాలను ప్రజలకు వివరించి గ్రామంలో మధ్య నిషేధం చేయాలని నిర్ణయించారు. గ్రామ పెద్దల, యువత అందరూ ఏకమై ఆ గ్రామంలో మద్య నిషేధం ప్రకటించారు. ఎవరైనా మద్యం తాగిన, అమ్మిన 50 వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతుందని గ్రామమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బాన్సువాడ మండలంలోని దేశాయ్ పేటలో మధ్య నిషేధం నిర్ణయించడం జరిగింది.దేశాయిపెట్ గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ చావిడి వద్ద గ్రామ పెద్దలు ,యువకుల సమక్షంలో మద్యం నిషేదం నిర్ణయించడం జరిగింది. మన గ్రామం ఆదర్శ వంతం గా నిలవాలని గ్రామ పెద్దలు యువకులు నిర్ణయించారు. ఈమధ్యం నిషేధం 21-10-2024 సోమవారం రోజు ఉదయం 6; 00 నుండి మద్యం నిషేదం చేయడం జరిగింది. ఇట్టి నిర్ణయాని కాదని ఎవరైనా మద్యం అమ్మినచో వారికి 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని అందరూ దీనికి సహకరించాలని గ్రామ పెద్దలు యువకులు సమక్షంలో గ్రామస్తులు అందరు కలిసి ఏకగ్రీవంగా తీర్మానించారు.