E-PAPER

వాస్తవాలు రాస్తే జర్నలిస్టులపై దాడులు చేయటం బాధాకరమైన విషయం

విలేకరులపై దాడులను ఖండించాలి

మందాడి సంజీవరావు

మణుగూరు, : నిరంతరం ప్రజల కోసం తమ కలాన్ని అక్షరాలుగా మార్చుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిజాలను వెలికితీసే జర్నలిస్టుల పై కొందరు దుండగులు, అరాచక శక్తులు దాడులు చేయడం బాధాకరమని ,
జాతీయ వినియోగదారుల మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు
మందాడి సంజీవరావు అన్నారు. శనివారం ఆయన పీవీ కాలనీ
లోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఇల్లెందులో జర్నలిస్టు
నిట్టా సుదర్శన్‌(ఆదాబ్‌ రిపోర్టర్‌)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు
మారణాయుధాలతో కాపుకాసి ఆయనపై
తీవ్రంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రపంచ పత్రికాస్వేచ్ఛా సూచికలో భారత్ స్థానం ఏటేటా దిగజారిపోతున్నదని , పాత్రికేయులు స్వేచ్ఛగా విధినిర్వహణ చేయలేని దారుణ పరిస్థితులలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
జిల్లాలో జర్నలిస్టులపై నానాటికీ దాడులు , తప్పుడుకేసు
లు పెరిగిపోతున్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని , దాడులు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని
సంజీవ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తు వాస్తవాలను వెలుగులోకి తేస్తే జీర్ణించుకోలేక జర్నలిస్టుల పై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని అలాంటి మీడియా జర్నలిస్టుల పైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అక్రమ వ్యాపారులు వాస్తవాలు రాసే జర్నలిస్టులపై అక్కడక్కడ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు.జర్నలిస్టుపై దాడికి పాల్పడిని వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించా
లని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్