మణుగూరు,అక్టోబర్12 వై 7 న్యూస్;
మణుగూరు మండలం రామానుజవరం లో ఫిజిల్ సైన్స్ ఉపాధ్యాయుడు జి.సురేష్ “టార్గెట్ టెట్/డియస్సీ” గ్రూప్ ను ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు. ముఖ్యంగా వేలకు వేలు ఫీజ్ కట్టి కోచింగ్ కు వెళ్ళ లేని పేద అభ్యర్థులు, గృహిణులు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యారు.ఉపాధ్యాయులు సురేష్ సొంతంగా తయారు చేసిన మెటీరియల్ ఉచితంగా అందించారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు సాయంత్రం ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించేవారు. సందేహాలను వాట్సాప్ గ్రూప్ లోనే తీర్చేవారు. సమకాలినాంశాలమీద మంచి పట్టు సాధించేలా చేసారు. ఆ విధంగా తర్ఫీదు పొందిన వివిధ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డియస్సీ లో ప్రభుత్వ కొలువు సాధించారు. ఉపాధ్యాయుడు జి.సురేష్ కృషిని పలువురు అభినంధించారు.
Post Views: 69