ఖమ్మం,అక్టోబర్11(వై 7 న్యూస్);
దేశవ్యాప్తంగా నవరాత్రి సంబరాలు ఘనగా నిర్వహిస్తున్నారు.పురాణాల ప్రకారం..మహిషాసురుడు అనే రాక్షసునిపై దుర్గా దేవి సాధించిన విజయాన్ని, రావణుడిపై శ్రీరామ చంద్రుడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా జరుపుకొంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయోత్సవమే ఈ దసరా. చీకటిని అంతం చేసే పండగ ఇది.చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుక చౌదరి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ఖమ్మం జిల్లా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు,సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
Post Views: 66