మెదక్, అక్టోబర్ 11.వై సెవెన్ న్యూస్
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా నియమితులైన డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీకి హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణ లో ఘనంగా అభినందన సభ జరిగింది. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ గిరీష్ కుమార్ సంఘి ఆధ్వర్యంలో జరిగిన సత్కార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి కైలాస్ రామచందర్ గుప్త హాజరై ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్, డాక్టర్ అప్సర్, దొంతి యాదగిరి, తాటి విశ్వనాథ్, బలరాం రెడ్డి లతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీకి బొకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.









