26 సంవత్స రాలుగా కార్యక్రమాలు
తూప్రాన్ సెప్టెంబర్ 5 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో మహంకాళి దేవాలయంలో శనివారం దేవీ నవరాత్రుల భాగంగా చండీ హవనం అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురోహితులు ఉదయ్ కుమార్ శర్మ నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సేవా సమితి నిర్వాహకులు వైభవితంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుమారు 2000 పైగా భక్తులు హాజరై అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిరోజు విశేష పూజలతో కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు మహా లింగార్చన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.. అమ్మవారి దీక్ష కార్యక్రమంలో మహిళామాతలు సుమారు 50 వరకు స్వాములు 200 పైగా అమ్మవారి మాల ధరించి నిత్యం పూజకార్యక్రమాలలో విధిగా పాల్గొంటున్నారు.