మధిర,అక్టోబర్05 వై 7 న్యూస్;
మదిర లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల మూడవ రోజు సందర్భంగా శ్రీ ప్రత్యంగిరా దేవి అలంకారం లో దర్శనమిచ్చినారు. భక్తులందరికీ దసరా సందర్భంగా శివలింగ సింహద్వారం నుండి ప్రవేశించి అమ్మవారిని దర్శించు కొన వలసిందిగా కోరుచున్నాము . పూజ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ ప్రత్యంగిరా దేవి అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినాము అని తెలిపినారు. పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించదరు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.