E-PAPER

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

మిర్యాలగూడ, అక్టోబర్ 04 వై7 న్యూస్
నాగభూషణం ప్రతినిధి ;

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు
ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగకుండా చూడాలని,
అంబులెన్స్ లకు దారి ఇవ్వాలని,ప్రతి ఆటో కు తప్పని సరిగా బీమా చేయించాలని,
ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని తెలిపారు.
డాక్టర్స్ కాలనీ, చర్చి బజార్, గణేష్ మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది కావున ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ ను ఎవరు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ,టూ టౌన్, సిఐలు, ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్